ఎస్పీ, బీఎస్పీలు పెద్ద తప్పు చేశాయి: కాంగ్రెస్

Share Icons:

లక్నో, 12 జనవరి:

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని లెక్కలోకి తీసుకోండా.. ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పోటీ చేసే స్థానాలని కాంగ్రెస్‌కే వదిలేసింది. ఇక మిగతా వాటిని మిత్రపక్షాలకు కేటాయించింది.

ఇక ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న అనూహ్యం నిర్ణయంతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి.. ఆ రెండు పార్టీలు పెద్ద తప్పు చేశాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోకుండా పొత్తును ఖరారు చేయడం.. ఎస్పీ, బీఎస్పీలు చేసిన ప్రమాదకరమైన తప్పిదమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కష్టకాలాన్ని ఎదుర్కోవచ్చు. కానీ, కాంగ్రెస్‌ను విస్మరించడం ఆ రెండు పార్టీలు చేసిన ప్రమాదకరమైన తప్పిదం‘‘ అని సింఘ్వి అభిప్రాయపడ్డారు.

మామాట: మీ మాటలని ఆ రెండు పార్టీలు లెక్కలో తీసుకుంటాయా..

Leave a Reply