దేశంలోని వ్యవస్థలని మోదీ నాశనం చేస్తున్నారు…

Share Icons:

హైదరాబాద్: శనివారం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో పేరుతో భారీ ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న విభజన, విధ్వంసకర విధానాలను ఈ ర్యాలీలో ఆ పార్టీ హైలైట్ చేయనుంది. ఈ సభకు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

ఇక హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేశారు. ఈ సందర్భాగ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జరిగిన భారత్‌ బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మోదీ దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నోట్ల రద్దు వికటించి ఆర్థిక పరిస్థితి మందగించిందని విమర్శించారు. అలాగే సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ రాచరిక పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దోపిడీ ఆపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు మాత్రమే శ్రీమంతులు అయ్యారని.. రాష్ట్రం మాత్రం దివాలా తీసిందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే అత్యాచార ఘటనలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయాల కోసం దేశం పరువు తీస్తున్నారంటూ బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి స్మృతి నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు శుక్రవారం రాత్రి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని..ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇక తాము మేకిన్ ఇండియా అంటుంటే.. రాహుల్ గాంధీ రేపిన్ ఇండియా అంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేయాలనేది ప్రజలకే వదిలేస్తున్నా.” అని స్మృతి ఇరానీ అన్నారు.

అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలు సరైనవే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడుతుంటారు. ఎవరైనా మేకిన్‌ ఇండియా వార్తల కోసం పేపర్‌ ఓపెన్‌ చేస్తే ఆ వార్తలు కనిపించడం లేదు. ఆ వార్తల స్థానంలో మనం ఏం చూస్తున్నాం.. రేప్‌ వార్తలు చూస్తున్నాం. పేపర్లలో కోకోల్లలుగా రేప్‌ వార్తలు వస్తున్నాయని.. అందుకే ఇది మేకిన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అని వ్యాఖ్యానించానని రాహుల్‌ సమర్థించుకున్నారు.

 

Leave a Reply