టీఆర్ఎస్‌లోకి సబితా, సుధీర్…?

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ…రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా తొలి విడుత ఆపరేషన్ ఆకర్ష్‌ని మొదలు పెట్టింది.

ఈ తొలి విడుటలో మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనేతలు వీరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. మంత్రి పదవి హామితో సబితా, నియోజకవర్గ అభివృద్ది కోసం సుధీర్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక సబితా కుమారుడు కార్టీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్దంగా ఉండటం కూడా ఆమె పార్టీ మారడానికి కారణంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ తరుపున చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరడంతో.. ఆ స్థానాన్ని కార్తీక్‌ రెడ్డికి ఇచ్చేందుకు టీఆర్ఎస్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు చేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నెల 17న తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారు కూడా పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మామాట: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం కరెక్ట్ కాదు అనుకుంటా…

Leave a Reply