కాంగ్రెస్ సభ్యులు దేశద్రోహుల్లా వ్యవహరించారు, కఠిన చర్యలు తప్పవ్ : హరీష్ రావు

కాంగ్రెస్ సభ్యులు దేశద్రోహుల్లా వ్యవహరించారు, కఠిన చర్యలు తప్పవ్ : హరీష్ రావు
Views:
71

గవర్నర్‌పై దాడా?

హైదారాబాద్, మార్చి 12 :

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు దేశద్రోహుల్లా దాడికి దిగారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాము ఉద్యమ సమయంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరు దేశభక్తితో చేసినదని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన దాడి మాత్రం ఉగ్రవాదుల చర్యల వంటిదని అన్నారు. వెంకటరెడ్డిపై తీవ్రమైన చర్యలు తప్పవని ఆయన చెప్పారు.

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అసహనంతో ఉన్నారు. సభలో ఎంతసేపైనా మాట్లాడే అవకాశం ఉన్నా, అవన్నీ మరచి నేరుగా వచ్చీరాగానే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటిని ప్రశ్నించారు.

నిజంగా వారికి ప్రజా సమస్యలపై అంతటి శ్రద్ధ ఉంటే చర్చించడానికి, ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ మార్గాన్ని ఎన్నుకోకుండా కేవలం హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరియైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుకే శాసనసభలో జరిగిన దాడి గవర్నర్ మీద జరిగిన దాడి మాత్రమేనని, ఆయనను గురి చూసిన చేసిన దాడి అని అన్నారు. అది గురి తప్పి స్వామిగౌడ్‌కు తగిలిందని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరెప్పుడూ పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్‌ నిర్ణయానికి వదిలేశామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు తెలుపుతామని అన్నారు.

మామాట : ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి… ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటే

English Summary :

Telangana State Minister Harish Rao alleged that congress is anti social elements. That they will take serious action against the congress MLAs

(Visited 15 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: