అవిశ్వాసానికి ఎందుకు మద్ధతు ఇవ్వరు? జీవన్ రెడ్డి

Share Icons:

జగిత్యాల, 19 మార్చి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాకి మద్ధతు తెలిపిన టీఆర్‌ఎస్ పార్టీ, ఇప్పుడు అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈరోజు ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ….టీఆర్‌ఎస్ ప్రభుత్వం వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

ప్రజా సమస్యలపై తాము మాట్లాడతామనే కేసీఆర్ తమని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు.

ఇక ప్రధాని మోదీ చేతిలో సీఎం కేసీఆర్‌ పావుగా మారారని, కేసీఆర్‌ది ఫ్రoట్ కాదని, ఎన్డీఏ ఆడుతున్న స్టంట్ అని ఆయన ఆరోపించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ దగ్గరకు వెళ్లే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.

మొదట ఏపీ హోదాకు మద్దతు ఇచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణ సమస్యలను కేసీఆర్‌ పక్కకు నెడుతున్నారని, అవిశ్వాసం చర్చకు రాకుండా డ్రామా ఆడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

మామాట: అన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగమేగా…

English summary:

Congress MLA Jeevan Reddy questioned why the TRS party, which supported the Andhra Pradesh state for special status, now has no support for no confidence motion on central government.

Leave a Reply