కేటీఆర్..మీ నాన్నని పర్మిషన్ అడిగే సవాల్ విసిరావా….!

Share Icons:

హైదరాబాద్:

 

ఇటీవల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ… నడ్డా మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని.. ఆయనో అబద్దాల అడ్డా అని విమర్శించారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని నడ్డా చదివేశారని అన్నారు. తెలంగాణలో కర్ణాటక తరహా రాజకీయాలు నడవవు అని హెచ్చరించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టును ఓవైపు నీతి ఆయోగ్ ప్రశంసిస్తుంటే.. మరోవైపు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడటానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను,అబద్దపు ప్రచారాలను టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ చలిమంటలతో రాజకీయాలు చేయాలనుకంటున్నారని విమర్శించారు. ఏదో చేసేస్తామని ఎగిరెగిరి పడుతున్న బీజేపీ వాళ్లను పట్టించుకోవద్దని అన్నారు.

 

కేటీఆర్ సవాల్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ గారు, సవాల్ విసిరే ముందు మీ నాన్న కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా?’ అని విజయశాంతి అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇదే మాదిరి సవాల్ విసిరారని ఎద్దేవా చేశారు

Leave a Reply