బీజేపీ చేసిందే మీరు చేశారుగా…ఇప్పటికైనా మారండి..

Share Icons:

హైదరాబాద్:

 

టీఆర్ఎస్ అధినాయకత్వంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అసమ్మతిని అంగీకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల విమర్శించారు. బీజేపీ కి సపోర్ట్ చేస్తే దేశభక్తులు లేదంటే దేశద్రోహులు చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇక ఆయన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. తనవరకూ వస్తే కాని అసలు తత్వం బోధపడలేదు అన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని విజయశాంతి విమర్శించారు.

 

గత ఐదేళ్ల కాలంలో  తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు… లేకపోతే తెలంగాణ ద్రోహులు అని టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేటీఆర్ అభిప్రాయం ఎలాగుందో, ఇన్నిరోజులూ ప్రతిపక్షాలన్నీ అదే ఆవేదనతో కొట్టుమిట్టాడాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ అధిష్ఠానానికి అసలు తత్వం బోధపడినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలు తో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు.

 

 

Leave a Reply