జగన్‌పై కాంగ్రెస్ నాయకురాలు వివాదాస్పద వ్యాఖ్యలు….

congress leader sunkara padmasri sensational comments on jagan
Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొన్న సుంకర పద్మశ్రీ చెప్పు చూపించి మరీ సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబు పిచ్చికుక్క అని సంబోధించారు. మనమేమైనా జగన్మోహన్ రెడ్డి లా జైలుకు వెళ్ళొచ్చామా అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి అంటూ ఆమె మండిపడ్డారు.

జగన్ నిజంగా ఒక తల్లికి కొడుకైతే, ఒక్క చెల్లికి అన్న అయితే, ఒక భార్యకు భర్త అయితే ఇంత మంది మహిళలతో కన్నీరు పెట్టించరని మండిపడ్డారు సుంకర పద్మశ్రీ. . రాజధాని అమరావతి విషయంలో, రాజధాని మహిళల విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు దారుణమని ఆమె మండిపడ్డారు.

అంతేకాదు రాజధాని మహిళలకు డబ్బులు ఎక్కువై, ఇళ్ళల్లో పేకాట శిబిరాలు నడుపుతున్నారని, ఆ పేకాట శిబిరాలను జగన్మోహన్ రెడ్డి మూయించి వేశారు కాబట్టి ఇప్పుడు రాజధాని మహిళలు ఆందోళన చేస్తున్నారని అవాకులు చెవాకులు పేలుతున్నారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అందుకే మహిళలపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని, సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుదెబ్బలు తింటారు అని చెప్పు చూపిస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అటు పాలించాల్సిన ప్రభువే రైతులను పోలీసులతో తన్నిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాపం ఊరికే పోదన్నారు. జగన్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ప్రకారమే.. హైపవర్‌ కమిటీ నివేదిక ఉంటుందని బుద్దా వెంకన్న తెలిపారు. రూ.43 వేల కోట్లు దోచినవారు నీతి, నిజాయితీ అనడం సిగ్గుచేటన్నారు. విజయసాయికి చిత్తశుద్ధి ఉంటే భరత్‌ భూములపై చర్చకు రావాలన్నారు. దేశంలో రైతులు కంటతడి పెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచిపోతుందన్నారు. ఏపీ పరిస్థితి పిచ్చోడిచేతిలో రాయిలా తయారైందని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

అలాగే ‘ఇన్‌సైడ్ ట్రేడింగ్ మీద సిట్టింగ్ జడ్జితో అమరావతి, విశాఖపట్నంలో విచారణకు సిద్ధమా..? దమ్ము, ధైర్యముంటే ప్రభుత్వం నిరూపించాలి’ అని వైసీపీ సర్కార్‌కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావ్ సవాల్ విసిరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పలువురు టీడీపీ నేతలకు భూములున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మ్యాప్‌తో సహా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి చెప్పిన జాబితాలో ప్రత్తిపాటి పుల్లారావ్ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పందించిన ఆయన తాజాగా మరోసారి స్పందిస్తూ.. దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.

 

Leave a Reply