ఆ బీజేపీ ఎమ్మెల్యే నాలుక కొస్తే 5 లక్షల ఇస్తా…!

ongress-leader-subodh-savji-declares-5-lakhs-reward-for-the-person-who-cuts-off-ram-kadams-tongue
Share Icons:

ముంబయి, 7 సెప్టెంబర్:

ఇటీవల మహారాష్ట్ర ఘాట్కోపర్ నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహాదండీ’ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మీకు నచ్చిన అమ్మాయిని ప్రపోజ్ చేయండి. మీ ప్రేమను ఆమె తిరస్కరిస్తే నాకు ఫోన్ చేయండి. నేను తప్పకుండా మీకు సాయం చేస్తాను. అమ్మాయిని కిడ్నాప్ చేసైనా సరై వివాహాం జరిపిస్తాను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకులు మండిపడ్డారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుబోధ్ సావ్జీ ఒక అడుగు ముందుకేసి రామ్ కదమ్ నాలుకను కత్తిరించిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తానంటూ ప్రకటించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరంగా ఉన్నాయని, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు.

Image result for ram kadam.

ఇది ఇలా ఉంటే తాను చేసిన వ్యాఖ్యలపై రామ్ కదమ్ స్పందిస్తూ… తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఎడిట్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారని అన్నారు. తాను తప్పుగా మాట్లాడితే అక్కడున్న మీడియా అప్పడే తనను ప్రశ్నించేదని, ఏదిఏమైనప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ తెలుపుతున్నానని అన్నారు.

మామాట: ప్రజాస్వామ్యంలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు…

Leave a Reply