అప్పుడు చేసిన ద్రోహనికి హరీష్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు: రేవంత్

Share Icons:

కొడంగల్:

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. . ప్రశ్నించేవాడు లేకుంటే పాలించేవాడిదే రాజ్యం అవుతుందని, ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు తనను ఎన్నికల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ కొడంగల్ ప్రజల ఆదరణ, ప్రేమను మర్చిపోనని స్పష్టం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని శ్రేణులకు సూచించారు.

 

కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ హరీశ్ రావును పంపారనీ, ఇప్పుడు హరీశ్ రావు పరిస్థితి ఏమైందో ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికి హరీశ్ రావు శిక్ష అనుభవిస్తున్నాడని వ్యాఖ్యానించారు. పొట్టివాడ్ని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోశమ్మ కొట్టిందన్నట్లుగా హరీశ్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.

 

కొడంగల్ ప్రజలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు.

 

కొడంగల్ అభివృద్ధిపై చర్చకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొడంగల్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని పిలుపు నిచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓటమిపాలు చేసేందుకు టీఆర్ఎస్ నేత హరీశ్ రావును కేసీఆర్ ఇక్కడికి పంపించారని ఆరోపించారు. ప్రస్తుతం హరీశ్ రావును కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Leave a Reply