TRENDING NOW

ఆ భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లు వేశారు…

ఆ భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లు వేశారు…

హైదరాబాద్, 8 అక్టోబర్:

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు షాపూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన సభ జరిగింది. ఈ సభకు హాజరైన డీకే అరుణ ప్రసంగిస్తూ…కేసీఆర్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని హైదరాబాద్‌లోని ఆంధ్రుల ఇళ్లను లాక్కుంటామని భయపెట్టారని, ఆ భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆంధ్రా సెటిలర్లు ఓటేశారని అన్నారు.

ఇక హైదరాబాద్‌ రోడ్ల కంటే గ్రామాల రోడ్లు అద్భుతంగా ఉన్నాయని, కేసీఆర్ ఎవరినైనా తిట్టొచ్చు కానీ.. ఆయనను మాత్రం ఎవరూ తిట్టొదట అని విమర్శించారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే నా బండారమేంటో బయటపెట్టాలి’ అని అరుణ సవాల్ విసిరారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

అలాగే ఈ సభకి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మహిళలపై వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే  డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయాలను గ్రాంట్‌గా ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి  ఏడాదికి  ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే మహిళా సంఘాల సభ్యుల్లోని కుటుంబసభ్యులకు అనారోగ్యానికి గురైతే  వారికి వైద్య చికిత్స కోసం రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. 

మామాట: మీరు అధికారంలోకి రావడానికి బాగానే ట్రై చేస్తున్నారుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: