TRENDING NOW

ఈ పొత్తుని సమర్ధించలేను అందుకే పార్టీని వీడుతున్నా…

ఈ పొత్తుని సమర్ధించలేను అందుకే పార్టీని వీడుతున్నా…

కడప, 3 నవంబర్:

టీడీపీతో కాంగ్రెస్ పొత్తును సమర్ధించలేనని అందుకే పార్టీ వీడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఏఐసీసీ కనీసం పీసీసీని కూడా సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.  

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు తాము ఇప్పటికీ మరచిపోలేమన్నారు. విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలని, సోనియాను దేశం నుంచి తరిమెయ్యాలి ఇలా ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

ఇక చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తాము ఎందుకు సమర్థించాలని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓ సిద్ధాంతం అనేది లేదని మండిపడ్డారు. అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాపాలను తాము భుజాన వేసుకునే ఖర్మ పట్టలేదన్నారు.

మామాట: ఇంకా పార్టీని వీడే నేతలు ఎంతమంది ఉన్నారో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: