ఆ ఐదు స్థానాలపైనే కాంగ్రెస్ ఆశలు…అందులో మల్కాజిగిరి పక్కానేనా?

Share Icons:

హైదరాబాద్, 24 ఏప్రిల్:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ….పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా లేదన్న ఐదు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. ఎందుకంటే ఆ ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బలమైన నేతలు పోటీ చేశారు. పైగా ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కి కొంత పట్టు ఉంది. ఆ స్థానాలు ఏవి అంటే..మల్కాజిగిరి, చేవెళ్ళ, ఖమ్మం, నల్గొండ, భువనగిరి. మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి రేణుకా చౌదరి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పోటీ చేశారు.

అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఐదు స్థానాలు ఈజీగా దక్కవని అర్ధమవుతుంది.  చెవేళ్ల‌, మ‌ల్కాజ్ గిరి మిన‌హా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌లేదంటున్నారు. భువ‌న‌గిరి నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, న‌ల్గొండ నుంచి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఇద్ద‌రూ సీనియ‌ర్ నేత‌లు కావ‌డం, జిల్లాలో కాంగ్రెస్ కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉండ‌టంతో ఈ రెండు స్థానాలూ క‌చ్చితంగా గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ ఆశ‌తో ఉంది. అయితే, ఇది అంత సులువు కాద‌ని అంటున్నారు. ఈ ఇద్ద‌రు అభ్య‌ర్థులు కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని, డ‌బ్బు ఖ‌ర్చుకు వెన‌కాడార‌ని అంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఇక్కడ గెలుపు కోసం కష్టపడిందని తెలుస్తోంది. కానీ కొంత కాంగ్రెస్ ఊపు తగ్గిన ఉత్తమ్, కోమటిరెడ్డిలు బొటాబోటి మెజారిటీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అటు ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అలాగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది. కానీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాత్రం కాంగ్రెస్ విజ‌యం అంత సులువు కాద‌ని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బ‌రిలో ఉన్న రేణుకా చౌద‌రికి మ‌ద్ద‌తుగా నాయ‌కులు పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కోసం ప‌నిచేయ‌డంతో ఆమెకు క్లిష్ట ప‌రిస్థితే ఎదురైంది. కానీ ఇక్కడున్న టీడీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపే ఎక్కువ ఉందని తెలుస్తోంది. కొంతవరకు రేణుకా చౌదరి విజయావకాశాలు బాగానే ఉన్నాయి.

ఇక కాంగ్రెస్‌కు ఎక్కువ ఆశలు పెట్టుకున్నవి. చేవెళ్ల, మ‌ల్కాజ్ గిరి నియోజ‌క‌వ‌ర్గాలపైనే. ఇక్క‌డ అభ్య‌ర్థులు విశ్వేశ్వ‌ర్ రెడ్డి ముందునుంచే గ్రౌండ్ వ‌ర్క్ చేసుకోవ‌డం క‌లిసి వ‌చ్చాయ‌ని అంటున్నారు. మ‌ల్కాజ్ గిరిలోనూ రేవంత్ రెడ్డికి కొంత విజ‌యావ‌శాలు ఉన్నాయ‌నే అంచ‌నాలు ఉన్నాయి. రేవంత్ ఇమేజ్, టీడీపీ ఓటు బ్యాంక్ కూడా రేవంత్ వైపే ఉండటం కలిసొస్తుందని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ 5 సీట్లలో మూడు ఖచ్చితంగా గెలిచుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మామాట: చూద్దాం మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో

Leave a Reply