రేవంత్ పదవి దక్కించుకోవాలంటే ఆ పని చేయాల్సిందే…!

Share Icons:

హైదరాబాద్:

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువహాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది పీసీసీ పగ్గాలు గురించే. ఆ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనేదానిపై చాలరోజులుగా చర్చ నడుస్తోంది. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల రేవంత్ కుటుంబంతో సహ ఢిల్లీకి వెళ్ళి జాతీయ అధ్యక్షరాలు సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగారు. ఇక అక్కడ నుంచి రేవంత్ కు సోనియా పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయమైందని వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ కు పీసీసీ పదవి అప్పగించడం చాలమందికి సీనియర్లకు నచ్చడం లేదు. అందుకే కొందరు సీనియర్లు ఢిల్లీలో మకాం వేసి మరి రేవంత్ కు పీసీసీ పదవి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీలో మకాం వేసిన టీ పెద్దలు రేవంత్ కు కాకుండా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిల్లో ఒకరికి పీసీసీ ఇవ్వాలని అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంచి ఫాలోయింగ్, క్రేజ్, వాక్చాతుర్యం గల రేవంత్ కి ఇస్తేనే టీఆర్ఎస్, బీజేపీలని ధీటుగా ఎదురుకోగలమని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ పీసీసీ పగ్గాలు దక్కాలంటే రేవంత్ కు అధిష్టానం ఓ పని అప్పగించినట్లు తెలుస్తోంది. అది పూర్తి చేస్తేనే పదవి ఇస్తారని కండిషన్ పెట్టినట్లు సమాచారం.

పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందని, అలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది అని భావించిన హై కమాండ్ అదే విషయాన్ని రేవంత్ కు చెప్పిందని సమాచారం. పీసీసీ పగ్గాలు అప్పజెప్పే విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేయాలని రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది.

కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి అంగీకారంతో ఈ విషయంపై ఒక క్లారిటీ తో రావాలని రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. కానీ తలపండిన మేధావులున్న కాంగ్రెస్ పార్టీలో అందరి ఏకాభిప్రాయం సాధ్యమేనా, రేవంత్ ఈ విషయంలో విజయం సాధిస్తారా అనేది పెద్ద ప్రశ్న.

 

Leave a Reply