“పదవిలో కొనసాగే అర్హత ‘షా’ కు లేదు” -కాంగ్రెస్

Share Icons:
  • నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేత వెనక కేంద్రం: కాంగ్రెస్
  • మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యo ఖూనీ చేసింది
  • పెగాసస్‌ చర్చకు మోదీ ఎందుకు అంగీకరించడం లేదు

పెగాసస్ వ్యవహారంలో. “ది వైర్ ” కథనం నేపథ్యంలో ప్రతిపక్షనాయకులకు చెందిన ఫోన్ల టాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ప్రతిపక్షాలు పార్లమెంట్ ను స్తంభింప చేశాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు న్యూ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి  హోమ్ మంత్రి అమిత్ షా నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది. 2019లో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం వెనక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్న ‘ది వైర్’ కథనం  పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

పెగాసస్ సాయంతో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని కేంద్రం కూలదోసిందన్నారు. మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం,  మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవాలో ప్రభుత్వాలు కూలిపోవడం వెనక కూడా కేంద్రం హస్తం ఉండొచ్చన్న అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దీనిపై రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply