ఆ డీల్ అవినీతికి జేజమ్మ: కాంగ్రెస్

Congress criticizes modi government on rafel deal
Share Icons:

ఢిల్లీ, 4 సెప్టెంబర్:

రాఫెల్ డీల్ అవినీతికి జేజమ్మ వంటిదని, అలాగే దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.  మోదీ హయాంలో రాఫెల్‌ విమానం ధర రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు మూడు రెట్లు ఎలా పెరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శక్తి సింగ్‌ గోహిల్‌ ప్రశ్నించారు. మోదీ కోట్లలోనే ముడుపులు స్వీకరిస్తారని ఆరోపించారు.

ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ముగ్గురు రక్షణ శాఖ మంత్రులను మార్చిందని అన్నారు. అరుణ్‌ జైట్లీ, మనోహర్‌ పారికర్‌ లాంటి నేతలు రాఫెల్‌ డీల్‌లో అవినీతి మరకలను తప్పించుకుని నిర్మలా సీతారామన్‌ను బలిపశువును చేశారన్నారు.

అయితే రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలకు చోటులేకుండా వాటిపై చర్చించేందుకు కమిటీలను నియమించాలని గోహిల్ కోరారు. ఒకవేళ రాఫెల్‌ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకోలేదని మోదీ ప్రభుత్వం భావిస్తే.. సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.

మరోవైపు బోఫోర్స్‌ కుంభకోణంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఎలాంటి సంబంధం లేకపోయినా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

మామాట: అలా అనుకుంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడూ ఇలాంటి జేజమ్మలు చాలానే ఉన్నాయి అనుకుంటా…!

Leave a Reply