ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్-95, టీడీపీ-14

Share Icons:

ఢిల్లీ, 1 నవంబర్:

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకుగాను కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజా కూటమి( మహాకూటమి)గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్  పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది.

గురవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై చర్చించారు. కాగా, నవంబర్ 8వ తేదీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వీలు కాకపోతే నవంబర్ 9వ తేదీన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో  95 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. ఇక మిగిలిన 24 సీట్లను మిత్ర పక్షాలను కేటాయించనుంది.

ఇక ఈరోజు సెంట్రల్ ఎన్నికల కమిటి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే  62 స్థానాల్లో అభ్యర్థులను పరిశీలించి 57 స్థానాల్లో అభ్యర్ధులని ఫైనల్ చేశారు. నవంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో మిగిలిన సీట్లలో కూడ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు.

కాగా, మిత్రపక్షాలకి కేటాయించిన 24 సీట్లలో టీడీపీకి 14 సీట్లను కేటాయించింది. అయితే టీజేఎస్ ‌ఎక్కువ సీట్లను కోరుతోంది. ఈ సీట్ల సర్దుబాటు కోసం టీజేఎస్ ‌ చీఫ్ కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  నవంబర్ రెండో తేదీన ఢిల్లీలో సమావేశం కానున్నారు. సీపీఐకి నాలుగు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీంతో టీజేఎస్ కు 6 సీట్లు దక్కే అవకాశం ఉంది.

మామాట: అయితే టీజేఎస్, సీపీఐలకి ఎక్కువ సీట్లు దక్కడం కష్టమే అనుకుంటా….

Leave a Reply