దుకాణం కట్టేసినట్టే నా.!

Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 19,

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డానికి  మరో   నెల లేదా అంతకంటే తక్కువ సమయం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అటు పాలక టిడిపి, ఇటు ప్రతిపక్షం  వై.సి.పి రెండూ ఘాఢంగా విశ్వస్తున్నాయి.అయితే, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బిజెపిల పరిస్థితి ఇందుకు  పూర్తిగా భిన్నమైనది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఫలితాలపై తమ ఆశలు కోల్పోయాయి.

కొన్ని నివేదికల ప్రకారం, అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ రెండూ తమ ఖాతాలను తెరవకపోవచ్చు. వాల్తేరు  రైల్వే జోన్ ప్రకటన తర్వాత బిజెపి కాంగ్రెస్ కంటే కొంచం మెరుగ్గా ఉందని భాజాపా భావిస్తోంది గానీ,  వాస్తవంలో పరిస్థితులు అంతబాగాలేవని వారికీ తెలుసు.

మామాట: ఇంతబతుకూ బతికి ఇంటివెనుక పోయినట్టు….

Leave a Reply