తెలంగాణలో కారు స్పీడుని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ…

Share Icons:

హైదరాబాద్, 24 మే:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి….లోక్‌సభ ఎన్నికల్లో బ్రేక్ పడింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు కారు స్పీడుకు బ్రేకులు వేశారు. సారు..కారు…పదహారు…ఢిల్లీలో సర్కారు. ఇది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు ఎత్తుకున్న నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో ఒకటి మిత్రపక్షం ఎం‌ఐ‌ఎంకి వదిలేసిన మిగతా 16 సీట్లు తమ ఖాతలోనే పడతాయని ధీమాలో ఉండిపోయారు.

అయితే ఎన్నికల ఫలితాలకొచ్చేసరికి మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో 11 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్…ఈసారి 9 సీట్లకే పరిమితం అయ్యారు. ఇక ఎవరు ఊహించని విధంగా ఇక్కడ బీజేపీ 4 సీట్లు దక్కించుకుంది. అటు కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న…ఈ ఎన్నికల్లో కోలుకుంది. 3 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెనకటరెడ్డిలు విజయం సాధించారు. ఇక ఎం‌ఐ‌ఎం తన స్థానం హైదరాబాద్‌ని నిలబెట్టుకుంది.

మామాట: పాలన వన్ సైడ్‌గా ఉంటే ఫలితాలే ఇలానే వస్తాయి

Leave a Reply