ఢిల్లీలో ఆప్ గెలిచినట్లే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది….

Comedian pruthviraj comments on YSRCP
Share Icons:

హైదరాబాద్, 31 జూలై:

2015లో ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఏ మేర విజయం సాధించిందో అదే విధంగా 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందని హాస్య నటుడు పృధ్వీరాజ్ జోస్యం చెప్పాడు.

తాజాగా ఆయన ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని అన్నాడు. అయితే తన అనుచరులు, ఇతర నేతలు చెప్పే మాటలు, సలహాలు, సూచనలను వైఎస్ జగన్ పట్టించుకోరని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నాడు.

తాను జగన్‌ను దగ్గర నుంచి చూశానని, ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసునని చెప్పారు. ఇక గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్‌కి ఇమేజ్‌ని చూసి, మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి విజయం కోసం శ్రమించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ  పేర్కొన్నారు. జగన్‌ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు.

మామాట: హాస్య నటుడు జోస్యం బాగానే చెప్పారు….!

Leave a Reply