టీడీపీ సోషల్ మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పృథ్వీ…..

Comedian pruthvi sensational comments on TDP
Share Icons:

గుంటూరు, 10 ఆగష్టు:

సీఎం చంద్రబాబు, టీడీపీ సోషల్ మీడియాపై 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’గా గుర్తింపు పొందిన హాస్య నటుడు పృధ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న గుంటూరులో జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల వైఎస్ జగన్‌ను చూసి ఎందుకు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

అలాగే తనని, పోసాని కృష్ణ మురళిని, కృష్ణుడిని కుక్కలమని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పారు. కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా అంటూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీకి కాపలా కుక్కలాగా ఉంటామని, రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు.

మామాట: మరి దీనికి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో?

Leave a Reply