30 ఇయర్స్ పృథ్వీకి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి…

Share Icons:

విజయవాడ, 16 ఫిబ్రవరి:

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీరాజ్.. ఇక అటు సినిమాల్లో రాణిస్తూనే ఇటు రాజకీయాల్లో కూడా మెరుస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా.. ఆయనతో కలిసి పార్టీ జెండా పట్టుకుని నడిచారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైసీపీ గొంతును బలంగా వినిపిస్తున్నారు.

ఇలా పార్టీ కోసం పృథ్వీ చేస్తున్న సేవలను గుర్తించిన వైసీపీ.. తాజాగా ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్‌ని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైసీపీలో తనకు దక్కిన పదవిపై పృథ్వీ సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మామాట: మొత్తానికి పృథ్వీ పదవి పట్టేశాడు…

Leave a Reply