జగన్‌పై అలీ ప్రశంసలు…విశాఖపై ఆసక్తికర కామెంట్స్…

Share Icons:

విశాఖపట్నం: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలీ మాట్లాడుతూ….విశాఖ ప్రజలు తెలివైన వారన్నారు అలీ.  ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారన్నారు. దీంతోపాటు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సేవలపై కూడా అలీ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖ ప్రజలు చాలా తెలివైన వారితోపాటు మంచోళ్లని, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ముస్లింలు మక్కా సందర్శన కోసం అందిస్తున్న ప్రయోజనాన్ని అర్హులంతావినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైజాగ్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు.  వ్యక్తిగతమైన అవసరాలతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా కూడా.. విశాఖపై ఉన్న అభిమానంతోనే ఈ సమావేశానికి వచ్చినట్లుగా తెలిపారు. ‘లచ్చిమీ డోంట్‌ టచ్‌ మీ, బాగున్నారా బాగున్నారా’ అంటూ డైలాగ్‌లు చెప్పి అక్కడున్నవారందరిని నవ్వించారు. ఈ సందర్భంగా అలీని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా సత్కరించారు.

ఇదిలా ఉంటే వైసీపీ నేతలకు విశాఖపై ఏ మాత్రం ప్రేమ లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దమ్ముంటే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ విశాఖలోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపై అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను తప్పుబట్టిన వైసీపీ… విశాఖలో ఎందుకు ల్యాండ్ పూలింగ్ అంటోందని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విశాఖలో ఎందుకు ఇల్లు తీసుకుని ఉంటున్నారని వ్యాఖ్యనించారు.

రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవని… ఒక్క విశాఖలోనే భూములు దోచుకోవడానికి ఉన్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేశానని కేసు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదని… రకరకాల కారణాల చెప్పి పెన్షన్స్ తీసేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పరిపాలన విధానం బాగోలేక ప్రజలను తప్పు పట్టించే విధంగా రాజధాని మార్పు అని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బొత్స మంత్రిగా ఉన్నపుడు ఓక్స్ వేగన్ పరిశ్రమ ఎందుకు ఆనాడు ఈ ప్రాంతం నుండి వెళ్లి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply