రాపాక రావాలని అనుకున్న…వైసీపీ వాళ్ళు రానివ్వడం కష్టమే … ?

police case against janasena mla
Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ లో బాగా హాట్ టాపిక్ అయినా నేత ఎవరైనా ఉన్నారంటే… పార్టీలో ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈయన గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వానికి బాగా అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే

రాపాక వరప్రసాద్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తాను జనసేనలోనే ఉన్నానని చెప్పిన రాపాక వరప్రసాద్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. అయితే ఇటీవల ఆయన , పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని పవన్ కల్యాణ్‌ అంటే, కావాలని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు రాపాక. అనవసరమైన కారణాలతో పవన్ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు సైతం వెళ్లలేదు రాపాక. అంతేకాదు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాపాక

అయితే ఆయన ఎప్పటికైనా వైసీపీలో చేరడం ఖాయమనే అభిప్రాయం స్థానిక వైసీపీ వర్గాల్లో నెలకొంది. దీంతో రాపాకకు చెక్ పెట్టేందుకు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి బొంతు రాజేశ్వర్‌రావు ఉన్నారు. ఆయన కంటే కూడా అమ్మాజీ అనే మరో మహిళా నేతకు పార్టీ నుంచి ఆశీస్సులు బలంగా ఉన్నాయి. ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవుతున్నారు. అయితే, రాపాక కేవలం స్టేజీ మీదకే పరిమితమని, క్షేత్రస్థాయిలో తమకే ఆధిపత్యమని బొంతు రాజేశ్వర్‌రావు స్పష్టం చేస్తున్నారు.  అంటే రాజోలు లో ప్రస్తుతం పరిస్థితులని చూస్తే ….రాపాక వైసీపీలోకి వెళ్లిన పెద్దగా ఉపయోగం ఉండదనేలా ఉంది.

 

Leave a Reply