యువ‌కుడి పొట్ట‌లో రూ.11 కోట్ల విలువైన కొకైన్! విమానాశ్ర‌యంలో ప‌ట్టివేత‌!

Share Icons:
  • అనుమానం వ‌చ్చి స్కాన్ చేసిన అధికారులు
  • దుబాయ్ నుంచి బెంగ‌ళూరు వ‌చ్చినట్లు గుర్తింపు
  • ఆఫ్రికా నుంచి డ్ర‌గ్స్                                                             

పొట్ట‌లో డ్ర‌గ్స్ పెట్టుకుని విమానం ఎక్కి బెంగ‌ళూరు చేరుకున్న ఓ యువ‌కుడిని అధికారులు అరెస్టు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.. దుబాయ్‌ నుంచి బెంగ‌ళూరు విమానాశ్ర‌యానికి వ‌చ్చే ఓ ఫ్లైట్ ఎక్కాడు ఆఫ్రికాకు చెందిన ఓ వ్య‌క్తి. అయితే, విమానంలో అత‌డు ఆహారం తిన‌లేదు, పానియాలూ తాగ‌లేదు. దీంతో అత‌డిపై సిబ్బందికి అనుమానం వ‌చ్చింది. బెంగ‌ళూరు విమానాశ్ర‌య అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.

విమానం దిగ‌గానే అత‌డిని అదుపులోకి తీసుకున్న అధికారులు స్కాన్ చేయ‌గా అత‌డి పొట్ట‌లో కొకైన్ ఉన్న‌ట్లు తేలింది. ద‌క్షిణాఫ్రికాలోని ఓ డ్ర‌గ్స్ వ్యాపారి త‌మ దేశానికి చెందిన ఓ వ్యక్తిని దుబాయ్ మీదుగా బెంగ‌ళూరుకు పంపించిన‌ట్లు అధికారులు గుర్తించారు. పొట్టలో ఉన్న కొకైన్ విలువ రూ.11 కోట్లు ఉంటుందని అంటున్నారు. దీనిపై త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply