విభజన హామీలు నెరవేర్చండి: సీఎం కేసీఆర్

Share Icons:

వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయండి…

ఢిల్లీ, 16 ఫిబ్రవరి:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఎం, అరుణ్ జైట్లీని కోరారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులపై ఇరువురు మధ్య చర్చ జరిగింది.

ఇక తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని, తమ రాష్ట్రంలో 9 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించడంపై జైట్లీకి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.

2014-17 వరకు రూ.1.350 కోట్లు విడుదల చేశారని, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ 450 కోట్ల నిధులు ఇంకా రాలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేసీఆర్ ఓ నివేదిక సమర్పించారు.

అయితే రైతులకు సాగు నిమిత్తం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్నామని, ఇందుకోసం బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉంచాలని ఆయన విన్నవించారు.

రాష్ట్రానికి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అందుకు తగిన నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు.

అదే విధంగా గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట ఇచ్చిన మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను కూడా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

మామాట: మరి కోరిన సాయాలు చేసేనా…!

English summary:

Telangana CM KCR met with Union Finance Minister Arun Jaitley on Thursday in New Delhi. On this occasion CM asked Arun Jaitley to implement the guarantees given in the division of the state.

Leave a Reply