ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్…

Cm KCR met with the pm modi
Share Icons:

ఢిల్లీ, 15 జూన్:

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలని కేసీఆర్ ప్రధానికి వివరించారు.

అందులో ప్రధానంగా పంటకు మద్దతు ధర , కొత్త జోనల్ విధానం, ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం, రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఆయన పీఎంను కోరారు.

అలాగే వీటితో పాటు విభజన హమీల అమలు విషయమై ప్రధానితో కేసీఆర్ చర్చించారని సమాచారం.

ఈ మేరకు ప్రధానమంత్రికి 10 లేఖలను ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ లేఖల్లో సీఎం ప్రస్తావించారు.

ఇక తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. మరో వైపు కరీంనగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాల్సిందిగా, అలాగే ఐఐఎం, ఐటీఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాల్సి ఉందని, కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదని చెప్పారు. అవి విడుదల చేయాలని కోరారు.

మామాట: మరి కేసీఆర్ డిమాండ్లని కేంద్ర నెరవేరుస్తుందా?

Leave a Reply