కేసీఆర్ బయోపిక్….’ఉద్యమ సింహం’

CM KCR biopic 'udyama simham'
Share Icons:

హైదరాబాద్, 28 జూన్:

ప్రస్తుతం టాలీ‌వుడ్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అలాగే సర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ని బాలకృష్ణ నిర్మిస్తున్నాడు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా రూపొందిస్తున్నారు.

kcr biopic

తాజాగా ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ చేరింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై రూపొందుతున్న బయోపిక్‌ ఈరోజు ప్రారంభమైంది.

ఈ  సినిమాలో కేసీఆర్‌ పాత్రలో విలక్షణ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తుండగా, అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్‌కు ‘ఉద్యమ సింహం’ పేరును ఖరారు చేశారు.

కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు ఈ సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్ష ప్రారంభించిన నవంబర్‌ 29 రోజే విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మామాట: మరి ఈ బయోపిక్ ఎలా ఉండబోతుందో..?

Leave a Reply