విశాఖ, జూన్ 04,
ఏపి సిఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్ చినముషిడివాడ శారదాపీఠాన్ని సందర్శించారు. అక్కడకు వెళ్లిన సిఎం జగన్కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిఎం జగన్ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని కానుకలు సమర్పించుకున్నారు.
విశాఖలో సిఎం జగన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపి సియంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు వెళ్లారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వా§్ులో శారదా పీఠానికి బయలుదేరారు. శారదా పీఠంలో స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుని, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయించుకోనున్నారు. జగన్ వెంట పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సిపి నేతలున్నారు.
మామాట- స్వాములకు రాజకీయాలు ఎక్కువైనాయి గా