మరో సంచలన నిర్ణయం దిశగా జగన్…వారికి పూర్తిగా అండగా…

Share Icons:

 

అమరావతి: అధికారం చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళుతున్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో భాగంగా తాజాగా జగన్ ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే ఈ పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించారు.

పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ.. వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, రహదారి ప్రమాదాలను తగ్గించాల్సిన బాధ్యత ఆటోవాలాలపై ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆటోవాలాలతో పాటు మరి కొన్ని వర్గాలకూ జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇది కూడా పాదయాత్రలో ఇచ్చిన హామీయే.

రాష్ట్రంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10 వేల సాయం అందిస్తామని వైఎస్ జగన్ పాదయాత్రలో పలుసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆటో,టాక్సీ డ్రైవర్లకు పది వేల రూపాయల సాయం అందడంతో ఇక ఆ కులాల వారు కూడా జగన్ వైపు చూస్తున్నారు. ఈ విషయంపై ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు క్లారిటీ ఇచ్చారు. ఆటోవాలాల తరహాలోనే రజకులకు, నాయీ బ్రాహ్మణులకు కుడా రూ. 10,00 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ త్వరలోనే అమలవుతుందని చెప్పారు.

ఇక అటు జగన్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అర్హులైన రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.12,500 (కేంద్రం ఇచ్చే 6వేలతో కలుపుకుని)ఇవ్వనుంది. ఇది లక్షలాది మంది రైతులకు పెద్ద ఊరట. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇస్తోంది.

అయితే రాష్ట్రం ఇచ్చే సాయంలో కేంద్రం ఇచ్చే వాటా కూడా ఉండటంతో ఇటీవల జగన్,…ప్రధాని మోడీని రైతు భరోసా ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే మోడీ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 

Leave a Reply