సీఎం జగన్ బంధువులు భూకబ్జా పైసీఎంఓ స్పందన!

Share Icons:
  • అక్బర్ సెల్ఫీ వీడియోపై విచారణకు ఆదేశం
  • విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశం
  • సీఐని విధుల నుంచి తప్పించామన్న ఎస్పీ

మైదుకూరులో బాషా భూమిని కబ్జా చేశారు : చంద్రబాబు

పొలం వివాదానికి సంబంధించి అక్బర్ బాషా కుటుంబసభ్యుల సెల్ఫీ వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి,  అక్బర్ భూమిని కబ్జా చేశారని… ఆయనకు సీఐ సహకరించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ అంశంపై సీఎం కార్యాలయం స్పందించింది. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.  అక్బర్ కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దువ్వూరు పోలీసుల సహకారంతో వారిని కాపాడగలిగామని అన్నారు. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

మైదుకూరులో అక్బర్ బాషా భూమిని జగన్ బంధువు కబ్జా చేశారు : చంద్రబాబు

మైదుకూరులో ముఖ్యమంత్రి జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందని,. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలై పోయిందని విమర్శించారు. తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సీఐ ఒకరు… అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారని  ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం  దారుణమని చంద్రబాబు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply