అమరావతిపై జగన్ సరికొత్త నిర్ణయం? అమలు సాధ్యమయ్యేనా?

amaravati capital changing news
Share Icons:

అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అమరావతిలో నిర్మించలేమని, లక్ష కోట్లు ఒకచోటే పెట్టలేమని చెబుతూ…రాష్ట్రానికి మూడు రాజధానుల ఉండాలనే ప్రతిపాదనని జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే విశాఖలో పరిపాలన పరమైన రాజధాని ఏర్పాటు చేయాలని, కర్నూలులో న్యాయ పరమైన రాజధానిగా, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఉంచుతామని చెబుతున్నారు.

అయితే మొత్తం రాజధానిని అమరావతిలోనే ఉంచాలని అక్కడి రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకొనున్నారని తెలుస్తోంది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించే అంశం మీద కసరత్తు జరుగుతోందని సమాచారం. అందు కోసం రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లతో పాటుగా..ఇప్పటికే నిర్మాణాల జరిగిన భూముల విషయంలోనూ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదన ప్రభుత్వం ఎంపిక చేసిన వారి ద్వారా రైతుల వద్ద ప్రతిపాదించనున్నట్లు సమాచారం.

అమరావతి గ్రామాల్లో ప్రస్తుతమున్న రోడ్లు.. భవనాలను యధాతధంగా ఉంచేసి మిగిలిన భూమిని స్పెషల్ అగ్రి జోన్ కు ఉపయోగించాలనే ప్రతిపాదన అందినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా.. ల్యాండ్ పూలింగ్ భూముల సహా ప్రభుత్వ భూములనూ ఈ ప్రత్యేక వ్యవసాయ జోన్ పరిధిలోకి తెచ్చే యోచన చేస్తున్నారు. స్పెషల్ అగ్రికల్చర్ జోనుకు రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి అనూకులమన్న నిపుణుల నివేదిక పైన అధ్యయనం చేస్తున్నారు. ఇదే సమయంలో..స్పెషల్ అగ్రికల్చర్ జోనులో రైతులను భాగస్వాములను చేయాలని సూచన అందింది. రైతులకు మరింత లబ్ది కలిగించాలని భావిస్తోన్న సర్కార్…ఈ ప్రతిపాదన పైన రైతులతో చర్చించాలని యోచిస్తోంది. మరి దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ నిర్ణయం అమలు చేస్తే రైతులు ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికర అంశం.

 

Leave a Reply