భూ వివాదాల పరిష్కారానికి జగన్ సరికొత్త నిర్ణయం….

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

అమరావతి:

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్ సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరగా చెక్ పెట్టేందుకు సరికొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్‌ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని జగన్ సూచించారు.

మంగళవారం స్పందన కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్‌’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలని సూచించారు. అప్పుడే భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలని, ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలని అన్నారు. అలాగే గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలు దీనిపై కలిసి కూర్చోని, భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలని కోరారు.

అయితే చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయని, వాటిని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని అన్నారు.

Leave a Reply