రేపు అమరావతిలో జెండా ఆవిష్కరించనున్న సీఎం జగన్

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

అమరావతి:

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక తొలి పండుగ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రేపు 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రేపు జెండా ఎగురవేస్తారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ కర్నూల్‌లోను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం కేంద్రాల్లో జెండా ఎగురవేస్తారు.

 

దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసే వారి జాబితాను సర్కారు విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు జెండా ఆవిష్కరిస్తారు. అలాగే ప్రకాశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో మంత్రి సుచరిత, శ్రీకాకుళంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌, విశాఖలో మంత్రి మోపిదేవి, గుంటూరులో మంత్రి పేర్ని నాని జెండా ఎగురవేయనున్నారు.

 

Leave a Reply