రాజ్యసభ సీట్ల పంపకం: సీఎం సడన్ ట్విస్ట్…

ap cm ys jagan starts amma vodi scheme
Share Icons:

అమరావతి: ఏపీ నుంచి ఎంపికయ్యే నలుగురు రాజ్యసభ సభ్యులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా మరో మంత్రి మోపిదేవి వెంకటరమణను పెద్దల సభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారు. వారిద్దరితోనూ రాత్రి పొద్దు పోయిన తరువాత చర్చించారు. తొలుత మోపిదేవి అందుకు పూర్తిగా అంగీకారం తెలపకపోయినా..జగన్ చెప్పటంతో చివరకు అంగీకరించారు. వైయస్సార్ మరణం నాటి నుండి పిల్లి సుబాష్ చంద్రబోస్ పూర్తిగా జగన్ తోనే నిలిచారు. ఆయన కు జగన్ 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో జగన్ తన కేబినెట్ లో బీసీ కోటాలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే శెట్టి బలిజ వర్గానికి చెందిన బోస్ కు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా ఆ వర్గానికి మరింతగా దగ్గరయ్యేందుకు జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక, మోపిదేవి గతంలో వైయస్పార్ హయాంలో మంత్రిగా పని చేసారు. ఆయన వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొని జగన్ తో పాటుగా జైలు శిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినా..తనతో పాటుగా తొలి నుండి నిలిచిన మోపిదేవిని కేబినెట్ లోకి తీసుకొని జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దు నిర్ణయంతో వారిద్దరనీ రాజ్యసభకు ఖరారు చేస్తూ జగన్ నిర్ణయించారు.

ఇక, తన వ్యాపార భాగస్వామిగా ఉంటూ..తొలి నుండి రాజకీయంగా తనకు రాజకీయంగా అండగా నిలిచిన అయోధ్య రామిరెడ్డికి సైతం జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం

ఇక, ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించటంతో ఆయనకు సైతం జగన్ ఓకే చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నాలుగు పేర్లను ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభ సీట్ల పైనా పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి..బీదా మస్తానరావు..మేకపాటి రాజమోహన రెడ్డి..పండుల రవీంద్ర బాబు వంటి వారు ఉన్నారు అయితే, రానున్న రోజుల్లో మరిన్ని సీట్లు వైసీపీకి రానున్నాయి. ఇక అప్పుడే వారికి న్యాయం జరిగే అవకాశముంది.

 

Leave a Reply