సీఎం -ఉద్యోగ సంఘాల నేతల హవా!

Meemaata lo maamaata Poll No 27 (1)
Share Icons:

క్విడ్ ప్రో కో అంటే నాకిది నీకది అనే సూత్రం. ఒక పని అక్రమంగా చేసిపెట్టినందుకు ఇరువురు భాగస్వాములు పంచుకునే విధానం. దీనిని చట్టం నేరంగా పరిగణిస్తుంది. శిక్ష విధిస్తుంది. అయితే, ప్రభుత్వానికి బయటి వ్యక్తులకే కాదు. ఇది ప్రభుత్వంలో భాగమైన పాలకులకు- ఉద్యోగనాయకులకు  మధ్య జరిగితే అది న్యాయవిరుద్దం కాదా, అనైతికం కాదా… ?

[pinpoll id=”60318″]

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, అంటే ప్రజలందరూ పరిపాలన చేస్తారా.. కాదు, తమను పాలించే పాలకులను ప్రజలు స్వయంగా ఎంపిక చేస్తారు. అందుకు రాజ్యాంగం పరిధులు నిర్ణయిస్తుంది. ఆ మేరకు పాలనా కొనసాగుతుంది. మరి పాలకులు అంటే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పాలకులతో పాటుగా ప్రభత్వ ఉద్యోగులు కూడా ప్రధాన భూమిక వహిస్తారు. ఉద్యోగులు పాలనాయంత్రాంగంలో కీలక భూమిక వహిస్తారు. పాలనా పరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయవలసిన వారు ఈ ఉద్యోగులే. అయితే ఉద్యోగులకు రాజకీయాలుండకూడదు. వారు రాజకీయ నేతలు కాదు. ప్రభుత్వాలు మారినా, ఉద్యోగులు మారరు. ఈ దృష్ఠి ఉద్యోగులకు ఉండాలి. పదవిలో ఉన్నవారు చెప్పేవన్నీ చేయడానికి కాదు ఉద్యోగులున్నది, వారి విధినిర్వహణ కోసం నిబంధనలుంటాయి. హక్కులు, బాధ్యతలు తెలిపే పట్టిక ఉంటుంది. దీనిని  అతిక్రమించకుండా, హద్దు దాటకుండా ఉద్యోగులు విధినిర్వహణ చేసినపుడు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇపుడు ఈ విధానం లేదు. రాజకీయపార్టీలతో సమానంగా ఉద్యోగ సంఘాలు ఏర్పడ్డాయి. ఉద్యోగులలో కుల,వర్గ, ప్రాంతీ, ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండే నాయకులను ఉద్యోగ సంఘాల నేతలుగా ఎదగడానికి పరోక్షంగా సహకరిస్తుంటాయి. ఈ ఉద్యోగులు కూడా సదరు రాజకీయ పార్టీకి  ఉద్యోగ సంఘాల నుంచి ఇబ్బంది కలక కుండా చూసుకుంటుంటారు. ఇదంతా, తెరవెనుక, చాప కింద నీరులా జరిగే వ్యవహారం. ఇటీవల ఆ రేఖా చెరిగిపోయింది. ఉద్యోగ సంఘాల నేతలుగా చెప్పుకునేవారిని ముఖ్యమంత్రి స్వయంగా రాజకీయీలలోకి రావాలనీ, టికెట్టు ఇస్తామనీ హామీ ఇవ్వడం మనకూ తెలుసు. ఇక ఆ ఉస నాయకుడు కూడా ఏకపక్ష నిర్ణయాలతో పాలక పక్షానికి తన వంతు సాయం చేస్తుంటాడనే పేరుంది.

ఇప్పుడిక అవన్నీ వదిలిపెట్టి ఏకంగా సదరు నాయకశోకుడు ఉద్యోగ విరమణ చేసి, రాజకీయ రంగస్థలంలోకి దూకాలనుకుంటున్నాడట. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి సంతోషంగా ఆహ్వానిస్తున్నారట, ఆయన ఉద్యోగం వదలిన వెంటనే అంత కంటే పెద్ద పదవి ఇస్తారట, మరో ఆరు మాసాల్లో ప్రజా ప్రాతినిధ్యం కూడా దక్కుతుందంట. ఏమిటీ వింత. ప్రస్తుతం తెలుగుదేశం పాలన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. అంతకుముందు దాదాపు పది సంవత్సరాలు  టీడీపీకి కష్టకాలం. ఆ సమయంలో ఎందరో సామాన్య కార్యకర్తలు పార్టీ జండా మోస్తూ, ఆస్తులు, వ్యాపారాలూ పోగొట్టుకున్నారు. అటువంటి వారికి ఈ ఐదు సంవత్సరాలలో కనీస న్యాయం కూడా దక్కలేదు. పార్టీ అధికారంలోకి రాగానే బాగా డబ్బున్న పెద్దల కోటరీ నామినేటెడ్ పదవులను తన్నకుపోయింది. పాపం పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీని కాపాడిన వారికి ప్రస్తుంత తిండికి కూడా లేదు గానీ, మధ్యలో వచ్చినవారికి పరమాన్నం దక్కుతోంది. ఇపుడు రాష్ట్రంలో చాలా నామినేటెడ్ పదవుల భర్తీ కోసం తెలుగు దేశం నాయకులు ఆశగా ముఖ్యమంత్రివైపు చూస్తున్నారన్నది నిజం. వారందరినీ కాదని ఇట్లా ఉద్యోగం రాజీనామా చేయడం అట్లా కార్పోరేషన్ పదవి పొందడం ఉద్యోగ సంఘం నాయకుడికి మాత్రమే ఎలా వీలవుతోంది. వేలాది కార్యకర్తలకు పార్టీ ఎలా సమాధానం చెబుతుంది. అడ్డదారిలో పదవులు ఎందుకు పంచి పెడుతున్నారు. ఆయన వలన పార్టీ పొందిన లాభం ఏమిటి తెలియాలి కదా. తెరవెనుక లాలూచీకే పదవులు ఇస్తున్నారా అని సామాన్య కార్యకర్త భావించినపుడు పార్టీమనుగడ కత్తిమీద సాముగా మారుతుంది. అధినేతపై నమ్మకాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ఆయనదేకదా… రేపు అధికారం పోయినపుడు ఈ బడా సాములు తిరిగి చూస్తారా, తెలుగు దేశం జండా మోస్తారా…

మామాట:  అంతా ఆ తానులో ముక్కలే కదా..   భేదం లేదనుకున్నారు.

Leave a Reply