‘జలసంరక్షణ’ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి

Share Icons:

గుంటూరు, 12 ఫిబ్రవరి:

రెండవదశ జలసంరక్షణ ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని పాలవాగులో పూడికతీత పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

cm chandrababu started work of palavagu

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….116రోజులు జరగనున్న రెండవదశ జలసంరక్షణ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భూగర్భ జలాల పరిస్థితిపై విశ్లేషించి ఎక్కువ పనులు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

అనంతరం ఆయన ‘జలసంరక్షణ’ ఆవశ్యకతపై పుస్తకాన్ని ఆవిష్కరించి, జిల్లాల వారీగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మామాట: ఇక్కడ జలసంరక్షణ’…అక్కడ ‘మిషన్ కాకతీయ’

English summary:

In the second phase of the ‘Jala Samrakshana’ movement, Chief Minister Chandrababu was work start in the  palavagu in Guntur district.

Leave a Reply