జగన్‌కి ఇది మొదటిసారి కాదు : చంద్రబాబు

Share Icons:

అమరావతి, 27 జనవరి:

బీజేపీతో దోస్తీ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తునకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

దీనిపైన చంద్రబాబు స్పందిస్తూ…బీజేపీతో కలుస్తానంటూ జగన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదని ఎద్దేవా చేశారు. ఒక మాటపై నిలబడే వ్యక్తిత్వం జగన్‌ది కాదని విమర్శించారు.

ఇదివరకు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్… ఇంతవరకు ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు. ఆయనపైన ఉన్న కేసులను ఎత్తి వేయించుకోవడానికి, అక్రమాస్తులను కాపాడుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మేము మిత్రధర్మం పాటిస్తున్నాం..

అలాగే మిత్రపక్షం బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలపైనా ముఖ్యమంత్రి స్పందించారు. భాజపాతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, ఇక దానిపైన భాజపా నేతలే ఆలోచించుకోవాలని స్పష్టంచేశారు. భాజపా నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా, తమ పార్టీ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని అన్నారు.

మామాట: జగన్ బీజేపీతో కలిస్తే బాబుకు ఉలుకెెందుకు ?

English summary: Chief Minister Chandrababu responded to Jagan’s comments about alliance with BJP. YS Jagan’s remarks were made clear that the if special status given by the BJP is alliance with the BJP. Chandrababu responded that it was not the first time that Jagan telling alliance with the BJP. He was criticized for not being the same personality.

Leave a Reply