చివరి ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం…

Share Icons:

తూర్పు గోదావరి, 20 ఫిబ్రవరి:

విభజన హామీలు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇక అప్ప‌టికీ కేంద్రంలో కదలిక రాకపోతే చివరి ప్రయత్నంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సోమవారం పోలవరం పనులు పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

మనకు ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా అవిశ్వాస తీర్మానం పెట్టలేమ‌ని, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతాన‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్ర‌మే ప్రయోగించాలని ఆయన చెప్పారు.

అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, అలా తాను చెప్పలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని ఆయన అన్నారు.

ఇక జగన్ సభా సంప్రదాయాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, అవిశ్వాసం ఏవిధంగా పెడతారో? ఎప్పుడు పెడతారో ఆయ‌న‌కు తెలియదని చంద్రబాబు విమర్శించారు.

ఒకసారి అవిశ్వాసం పెడితే మళ్లీ ఆరు నెలల వరకూ మాట్లాడటానికి అవకాశం ఉండదని, అవేం తెలియకుండా అవిశ్వాసం పెడతాను, మ‌ద్ద‌తు ఇవ్వాలని అవివేకంతో జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముందు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి పెంచాలని, అప్పటికీ కాకపోతే చివరిగా మాత్రమే ఆ ప్రయత్నం చేయాల‌ని ఆయన తెలిపారు.

విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీతో కలిశామ‌ని చెప్పారు. ఇన్నేళ్లుగా న్యాయం జరగలేదని అన్నారు.

మామాట: ఎన్నికలకి ఇంకో సంవత్సరం ఉండగా న్యాయం జరగలేదని తెలిసినట్లుంది….

English summary:

Chandrababu said the pressure on the central government should be taken to implement division guarantees of State. Then central government has no responds on that next we will move to no confidence motion on government.

Leave a Reply