మంత్రులకి ర్యాంకులు కేటాయించిన బాబు..

Share Icons:

అమరావతి, 6 ఫిబ్రవరి:

రాష్ట్ర మంత్రుల పనితీరుకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి ర్యాంకులను కేటాయించారు.

సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో పలువురు మంత్రులు ముందున్నారంటూ కితాబిచ్చారు.

ఎన్నో అంశాలను పరిశీలించి ఈ ర్యాంకులను ఇస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

పనితీరు, సమస్యల పరిష్కారించడంలో మొదటి స్థానంలో నారాయణ, రెండో స్థానంలో నారా లోకేష్ ఉన్నారని చెప్పారు. అలాగే, మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు వున్నారని ఆయన అన్నారు.

ఇక చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. మంత్రులంతా తమ పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఒకవేళ  పనితీరు బాగాలేకుంటే పదవి నుంచి తొలగించేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు.

మామాట: ర్యాంకులు అయితే కనిపిస్తున్నాయి…కానీ పని…

English summary:

Chief Minister Chandrababu Naidu announced the rankings for the working of state ministers. On Monday, he held a video conference with his collectors and noted that many ministers were in the forefront of the problems. Chandrababu said, “I have a look at a number of factors and give these rankings.

Leave a Reply