వాళ్ళకి కొనసాగిస్తూ… మాకెందుకివ్వరు?

Share Icons:

అనంతపురం, 23 ఫిబ్రవరి:

ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఇంకా కొనసాగిస్తూ, మాకు ఎందుకు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

గురువారం అనంతపురం జిల్లా పెనుకొండలో కియా మోటార్స్‌ సంస్థ ఫ్రేమ్‌ ఇన్‌ స్టలేషన్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కియా ప్రాంగణం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

 ఇకపై ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికే ఆ హోదా పొందిన రాష్ట్రాలకు ఇంకా ఎందుకు ప్రత్యేకహోదాను కొనసాగిస్తోందని అడిగారు.

ఆ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ కొనసాగిస్తున్నప్పుడు, మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు? అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము డిమాండ్ చేస్తున్నవన్నీ సహేతుకమైనవేనని అన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో తమ రాష్ట్ర తలసరి ఆదాయమే తక్కువగా ఉందని ఆయన చెప్పారు.

ఇతర దక్షిణాది రాష్ట్రాల్లా ఆర్థికంగా ఎదిగేవరకూ కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, నిధుల లోటు పూరించడమే కాకుండా ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు.

తామంతా కష్టపడుతుండడంతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని, అలాంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా, హామీల అమలు సాధన తమ హక్కని, దానిని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.

అలాగే పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని, కేంద్రం ఒక్కోసారి ఇబ్బంది పెట్టినా నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ఆ మధ్య ఓ కార్యదర్శి అడ్డుపడటంతో పనులు కొంత మందగించాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పోలవరం పూర్తిచేసి తీరతామని సీఎం స్పష్టం చేశారు.

మామాట: అదేదో పొత్తు నుండి బయటకొచ్చి పోరాడండి…

English summary:

Chief Minister Chandrababu Naidu blamed the central government for not giving us the status quo for the states that have given special status. On Thursday, he opened the Frame-in-Depth section of the Kia Motors company in Penukonda, Anantapur district.

Leave a Reply