నేను రాయలసీమ బిడ్డనే: చంద్రబాబు

Share Icons:

అమరావతి, 24 ఫిబ్రవరి:

ఏపీ బీజేపీ నేతలు శుక్రవారం కర్నూలు వేదికగా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు.

తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, ఆ ప్రాంతాన్ని ఇంకా ఎలా అభివృద్ది చేయాలో తనకు తెలుసని ఘాటుగా సమాధానమిచ్చారు.

బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. అలాగే రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందంటూ ఆయన మండిపడ్డారు.

రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు. అలాగే కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని ఆయన తెలిపారు.

అమరావతిలో దేశ రెండో రాజధానిని, కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈరోజు అమరావతిలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోలేదని… అందుకే తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు.

కేంద్రంపై ఒత్తిడి చేసే విషయంలో టీడీపీ నేతలు అనుసరించాల్సిన వైఖరిపై ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎంపీలు మార్చి 5 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

మామాట: మరి ఇంకా వెనుకబడిన ప్రాంతమని ఎందుకు అంటున్నారో…

English summary:

Chief Minister Chandrababu Naidu responds on the Rayalaseema Declaration announced by AP BJP leaders Friday in Kurnool. He said that he is also a child of Rayalaseema and that he knows how to develop the area.

One Comment on “నేను రాయలసీమ బిడ్డనే: చంద్రబాబు”

  1. ఆహా బాబుగారు… ఏమి చెబితిరి.. ఏమి చెబితిరి… మీరు రాయసీమ బిడ్డా..? కోస్తా దత్తపుత్రుడా..?

Leave a Reply