పరిశ్రమలకోసమే.. వెళ్లా

పరిశ్రమలకోసమే.. వెళ్లా
Views:
31

అమరావతి, జూలై 11, తనపై వచ్చిన విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… కొందరు తనపై బురదజల్లడానికి ప్రయత్నిస్తూ రాష్ట్రానికి నష్టంకలిగిస్తున్నారని తెలిపారు.  అవినీతి సొమ్ము దాచుకోవడానికి తాను  సింగపూర్ పర్యటనకు వెళ్లాననడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.  కానీ తాను ప్రజలకోసం పనిచేస్తున్నానని, నవ్యాంధ్రకు  పారిశ్రామిక పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పర్యటించానని సీఎం వివరించారు. తన పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. అతిపెద్ద సంస్థ కియా మోటార్స్‌ ఏపీకి వచ్చిందని, జనవరిలో కియా మోటార్స్‌ మొదటికారు బయటకు వస్తుందని చెప్పారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మామాట : ఇంకా కియో నేనా కొత్తది ఏదన్నా చెప్పెండి బాబూ.

(Visited 37 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: