అన్న సంజీవని మూత!

Share Icons:

విజయవాడ,జూలై 16, పేదలకు తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని పేరుతో జనరిక్‌ మందుల దుకాణాలను అందుబాటులోకి తీసుకొచ్చినవిషయం తెలిసిందే.  కాగా, గ్రామాలలో .. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పట్టణాలు, మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన దుకాణాల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు  ప్రభుత్వం అప్పజెప్పింది. అయితే తొలుత స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా ఎక్కువ లాభాపేక్ష లేకుండా మందులను రోగులకు తక్కువ ధరకు అందిస్తుండటంతో రోజురోజుకీ వీటి ఆదరణ పెరుగుతోంది. కానీ ప్రస్తుతం దుకాణాల నిర్వహణపై సరైన పర్యవేక్షణ కొరవడటంతో మూతపడే స్థితికి చేరుకున్నాయి. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన మందులను ఈ దుకాణాలకు పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నష్టాలు వస్తున్నాయి. దీంతో మూడో వంతు దుకాణాలను నష్టాల పేరుతో మూసిసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి విడతల వారీగా ఎంపికచేసిన కేంద్రాలలో అన్న సంజీవని మందుల దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 302 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 23 కేంద్రాలను ఏర్పాటుచేసింది. దుకాణాలను ఏర్పాటుచేసిన తొలినాళ్లలో సుమారు 300లకు పైగా రకాల మందులను అందుబాటులో ఉంచుతూ వచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారితోపాటు పేదలు, వృద్ధులు ఈ దుకాణాలకు వచ్చి మందులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. బహిరంగ మార్కెట్‌లో రూ.1,000 వరకు విలువచేసే మందులు ఇక్కడ రూ.400ల నుంచి రూ.600లలోపే ఇస్తుండటంతో వీటికి ఆదరణ పెరిగింది.  కానీ,

కొన్ని నెలలుగా అన్న సంజీవని దుకాణాలకు అవసరమైన మందులు పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. ప్రైవేటు మెడికల్ దుకాణాల సిండికేట్ తో చేతులు కలిపిన అధికారలు అన్నసంజీవని దుకాణాలను  ఆదాయం లేదంటూ మూసివేతకు రంగం సిద్ధం చేశారు.

మామాట :  సంజీవనికే చికిత్సకావాలా నాయనా… ప్రభుత్వ పర్యవేక్షణ లేకుంటే ఇంతే.

Leave a Reply