ముందస్తు తో కోట్లు చేతులు మారుతున్నాయి

clearing-files-for-money-in-telangana-for-early-polls-kodandaram
Share Icons:

జగిత్యాల, ఆగష్టు 28 ,

గత నాలుగు సంవత్సరాలుగా సచివాలయం నేల మాలిగల్లో దాగిన ఫైళ్ల పై ఇప్పుడెందుకు సంతకాలు పెడుతున్నారని కోదండరాం అన్నారు..  తెలంగాణ సీఎం ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉండగా  ఆయన  మంత్రులు మాత్రం , ఇన్నాళ్లు సచివాలయ మొహం చూడకుండా.. ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారని ’ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, మధ్యంతర ఎన్నికల అవసరం ఏమొచ్చిందో చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేసారు.. మంగళవారం ఆయన జగిత్యాలో విలేకరులతో మాట్లాడుతూ… హడావిడిగా ఫైళ్లు ఎందుకు క్లియర్ చేస్తున్నారని ప్రశ్నించారు. హడావుడిగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని… ఫైళ్ల క్లియరెన్స్ లలో కోట్లు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు.ఫైళ్లు క్లియరెన్స్ లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయో  ఎవరికీ తెలియడం లేదన్నారు.  అనుకూలంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడానికి పనిని బట్టీ రేటున్నట్టు తెలిసిందన్నారు.  దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలని  ఆయన డిమాండు చేశారు.

మామాట : ఫైళ్లున్నది పైసలు పిండుకోవడానికి కాదా…

Leave a Reply