నేను టీడీపీలోనే ఉన్నా…గుంటూరు నుండి పోటీ చేయాలనుకుంటున్న…

Share Icons:

విశాఖపట్నం, 9 జనవరి:

గత కొన్ని రోజులుగా…సినీ నటుడు అలీ రాజకీయ ఆరంగ్రేటం సంచలనం రేపుతోంది. మొన్నటికి మొన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని కలిసిన ఆయన….ఆ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో అలీ భేటీ అయ్యారు. దీంతో అలీ ఏ పార్టీలో చేరతారో అర్ధం కాక రాజకీయ విశ్లేశుకులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న అలీ ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంత్రితో దాదాపు గంట పాటు చర్చలు జరిపిన ఆయన, పవన్ కల్యాణ్ పార్టీని పెట్టినా, తననేమీ ఆహ్వానించలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని చెప్పారు. ఇక తను గడచిన 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని, తనకు గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని హాస్య నటుడ అలీ, ఏపీ మంత్రి గంటాకు తేల్చి చెప్పారు.

అయితే తాను మర్యాదపూర్వకంగానే జగన్, పవన్ లను కలిశానని అన్నారు. తాను చంద్రబాబును కూడా కలిసి, గుంటూరు నుంచి పోటీ చేసే విషయమై మాట్లాడగా, ఆయన భరోసా ఇచ్చారని, మీ తరఫున సహకారం కావాలని గంటాతో భేటీలో అలీ చెప్పినట్టు సమాచారం.

మామాట: మరి టీడీపీ సీటు ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాల్సిందేనా..

Leave a Reply