క్రిస్మస్ శుభాకాంక్షలు 

Christmas wishes
Share Icons:

తిరుపతి, డిసెంబర్ 25

శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన జీసస్ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరి హృదయాలు ఆనందం, సంతోషంతో ఉండాలని , భగవంతుని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తున్నాం.

ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ప్రధానంగా డిసెంబరు 25న  ప్రపంచవ్యాప్తంగా   ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక వేడుక క్రిస్మస్. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.  కాగా, కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహాం వచ్చినప్పుడు వసతి గృహం (ఇన్)లో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరుకింది, అక్కడే క్రీస్తు జన్మించాడు. దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.

 క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికి పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ పండగను డిసెంబరు 25 వ తేదీన  నిర్వహించడం ప్రారంభించింది. తరువాత ఇదే తేదీని తూర్పు క్రైస్తవ సమాజం కూడా స్వీకరించింది. ప్రస్తుతం క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన క్రీస్తు జన్మదినం , క్రిస్మస్ పండగ నిర్వహించుకుంటున్నారు.

పండగ సందర్భంగా రాష్ట్రపతి కొవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోది, గవర్నర్ నరశింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్. జగన్ సహా పలువురు నేతలు, మంత్రులు, ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ద చర్చిలలో క్రైస్తవులు పెద్దఎత్తన పండగలో పాల్గొంటున్నారు.

మామాట: మామాట వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

Leave a Reply