కోడికత్తి దాడి-వాడి -వేడి

Share Icons:

రాజకీయాలలో అధికారం శాస్వతం కాదు. అదీ ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు లేకుండా పాలకులుగా మనలేరు. అందువలన అధికారం కావాలనుకునేవారు ప్రజలకు దగ్గర కావాలి.. కుట్రలు కుతంత్రాలతో పరిపాలనా పగ్గాలు చేపట్టలేరు.

[pinpoll id=”67686″]

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.యస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయం వేదికగా కోడి కత్తి దాడి నాటకం ప్రధమ అంకం నుంచీ ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతోంది.  కేబినెట్ మంత్రి పోదా కలిగిన ప్రతిపక్షనేతపై, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగింది. దీనిని స్వంత నాటకంగా తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేస్తుండగా, తీవ్రమైన హత్యాయత్నంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి పత్రికలు-పోలీసులు-పాలకులు –ప్రజలూ ఏమనుకుంటున్నారు. పాలకులనుకుంటున్నదానికనుగుణంగానే పోలీసులూ అనుకోవడం సహజం. ఇక ఇపుడు పత్రికలు కూడా తమ తమ జెండా రంగులకు అనుకూలంగానే సమాచారాన్ని వండి వార్తలుగా వడ్డిస్తున్నాయి. సో… చివరగా ఈ సంఘటనపై న్యాయనిర్ణేతలైన ప్రజలేమనుకుంటున్నారో తెలియవలసి ఉంది.

కాగా, కేసు విచారణను ఏపీ పోలీసుల పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలోకి వెళ్లింది. కోర్టులో దీనికి సంబంధించిన వాద ప్రతివాదనలు కూడా జరిగాయి.  ఇపుడు ఏం జరగనుంది. ఈ తాజా చర్యతో నిజం విలుగు చూస్తుందా. లేక విచారణ మరింత ఆలస్యమై మూలనపడుతుందా.. లేకపోతే రాజకీయ కక్షసాధింపులకు కొత్త వేదికగా మారుతుందా… ఏం జరగనుంది?

మామాట: కోడి కత్తి కేసు కోడి పెట్టలాగా కూస్తూనే ఉంది..

Leave a Reply