కారులోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చిత్తూరు కలెక్టర్

Share Icons:

చిత్తూరు, 24 ఫిబ్రవరి:

తన పరిపాలనలో సాంకేతికతని జోడించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశం.

దానికి అనుగుణంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధాని అమరావతిలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌‌ని ప్రారంభించారు. తద్వారా 24 గంటలు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చు. అలాగే అధికారులతో నేరుగా మాట్లాడటానికి ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. దీని వలన సమయం కూడా చాలా ఆదా అవుతుంటుంది.

ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా కలెక్టరు పి.ఎస్.ప్రద్యుమ్నకూడా ఇంకా ఎక్కువ సమయం ఆదా అయ్యేలా తమ వాహనము నుండి మార్గమధ్యంలోనే జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో జిల్లాకి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

PS Pradyumna conducted a Video Conference with District Officers from their vehicle

అలాగే జిల్లాలోనే పలు అభివృద్ది కార్యక్రమాలకి సంబంధించిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఇలా మార్గ మధ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

మామాట: సమయం విలువైంది….

English summary:

Chittoor District Collector PS Pradyumna conducted a Video Conference with District Officers from their vehicle.

Leave a Reply