తెలుగు  రాష్ట్రాల్లో దుమ్మురేపుతోన్న సైరా కలెక్షన్లు…

chiranjeevi syeraa movie first week collections
Share Icons:

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. గత బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం అదరగొడుతుంది. వీకెండ్ లో దుమ్మెలేపిన సైరా కలెక్షన్లు దసరా పండుగ రోజు మంచి వసూళ్లు రాబట్టింది. చిత్రం నైజాం, ఆంధ్రాలో రికార్డు నికర వసూళ్లు సాధించడం విశేషం. అయితే బుధవారం నుంచి ఈ చిత్ర కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వారాంతం సినిమా కలెక్షన్లు ఊపందుకొంటే లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది.

పైగా బుధవారం నుంచి ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు తగ్గించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు రూ.250 టికెట్ వసూలు చేస్తుండటం తెలిసిందే. అయితే వారం తర్వాత ఈ రేట్లు సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ టికెట్లు రేట్లు తగ్గితే సాధారణ ప్రజలు థియేటర్లకు వెళ్లే వెసులుబాటు కనిపిస్తున్నది. నిన్న దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే సైరా చిత్రం రూ.6.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. దసరా పండుగ సెలవు కావడంతో కలెక్షన్లు పుంజుకొన్నట్టు తెలుస్తున్నది. మొత్తం మీద ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల షేర్ రాబట్టింది.

అయితే ఇతర భాషల్లో సైరా పరిస్థితి దారుణంగా ఉంది. తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. పలు రాష్ట్రాల్లో సైరా సినిమాను చాలా థియేటర్ల నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ఇక తెలుగు, ఓవర్సీస్‌లో తప్పితే మిగితా చోట్ల సైరాకు చేదు అనుభవమే మిగిలిందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సైరా చిత్రం వారం రోజుల్లో రూ.112 కోట్ల షేర్ ని, రూ.185 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తున్నది.

అయితే సైరా థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. దాదాపు రూ.200 కోట్ల మేరకు జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా కనీసం 88 కోట్ల మేర రాబట్టాల్సింది. పైగా ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ నుంచి రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఎందుకంటే హింది, తమిళ్, మలయాళం బాషల్లో సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో సైరా ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో.

 

Leave a Reply